జీవీఎంసీ అధికారులకు మెంటల్ వచ్చిందేమో అర్థం కావడంలేదు: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

08-06-2021 Tue 17:51
  • విశాఖలో మానసిక దివ్యాంగుల స్కూల్ కూల్చివేత
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు
  • మనుషులా? పశువులా? అంటూ మండిపాటు
  • రాష్ట్రంలో వింత ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు
BJP leader Vishnu Kumar Raju fires on GVMC officials

ఇటీవల విశాఖలో హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు మనుషులా? పశువులా? అని మండిపడ్డారు. జీవీఎంసీ అధికారులకు మెంటల్ ఏమైనా వచ్చిందేమో అర్థం కావడంలేదని విమర్శించారు.

 కొందరు అధికారులు అధికారమదంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా విశాఖలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చేశారని వ్యాఖ్యానించారు. ప్రజావేదికతో ప్రారంభమైన కూల్చివేతల పర్వం మానసిక వికలాంగుల స్కూల్ వరకు వచ్చిందని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం, వింత ముఖ్యమంత్రి కొనసాగుతున్నారని ఆగ్రహంగా అన్నారు.