సంతోష్ శోభన్ జోడీగా మెహ్రీన్ .. దర్శకుడిగా మారుతి!

08-06-2021 Tue 17:04
  • అందాల నాయికగా క్రేజ్
  • కరోనా కారణంగా పెళ్లి వాయిదా
  • మారుతి దర్శకత్వంలో మరో సినిమా  
Maruthi next movie heroine is Mehreen

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయినా, అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తెలుగులో మెహ్రీన్ చేసిన సినిమాల్లో 'ఎఫ్ 2' .. 'మహానుభావుడు' సినిమాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమాను చేస్తోంది. కెరియర్ ఊపందుకుంటున్న సమయంలోనే మెహ్రీన్ కి పెళ్లి కుదిరింది. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా పెళ్లి వాయిదా పడింది.

ఈ గ్యాపులో సినిమాలు చేయాలని మెహ్రీన్ నిర్ణయించుకుందట. అందువల్లనే మారుతి దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తోందని అంటున్నారు. సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి ఒక చిన్న సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ జోడీగా ఆయన మెహ్రీన్ ను ఒప్పించాడని అంటున్నారు. గతంలో తనకి 'మహానుభావుడు' వంటి హిట్ ఇచ్చిన కారణంగా మెహ్రీన్ అంగీకరించిందని చెబుతున్నారు. హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగు జరుగుతోందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.