స్వల్ప నష్టాలలో ముగిసిన మార్కెట్లు

08-06-2021 Tue 16:24
  • మదుపరుల లాభాల స్వీకరణ
  • 53 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్
  • 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ
Stock Markets closed in red today

మదుపరులు నేడు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు స్వల్ప నష్టాలలో ముగిశాయి. ఈ రోజు ఉదయం నుంచీ సూచీలు మందకొడిగానే కదలాడాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్ రంగాల సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఈ రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి.

అయితే, ఐటీ, పవర్ సెక్టార్లలో కొనుగోళ్లు జరగడంతో ఆయా షేర్లు లాభాలను గడించాయి. ఈ క్రమంలో 53 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 52,276 వద్ద.. 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,740 వద్ద క్లోజయ్యాయి.

ఇక నేటి సెషన్ లో ఫైజర్, ఆర్తి ఇండస్ట్రీస్, టాటా పవర్, ఎల్&టి ఇన్ఫోటెక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, అదానీ ఎంటర్ ప్రైజెస్ తదితర షేర్లు లాభాలు పొందగా... వోల్టాస్, హిందాల్కో, కెనరా బ్యాంక్, ముతూట్ ఫైనాన్స్, ఎమ్మారెఫ్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.