దేశంలో 135 కోట్ల జనాభా ఉన్నప్పుడు వ్యాక్సిన్ కొరత సహజం ఒవైసీ జీ: విజయశాంతి

08-06-2021 Tue 14:33
  • నిన్న వ్యాక్సిన్లపై ప్రసంగించిన ప్రధాని
  • మోదీ స్పీచ్ పై ఒవైసీ విమర్శలు
  • బదులిచ్చిన విజయశాంతి
  • ప్రపంచంలో చాలాచోట్ల ఇలాగే ఉందని వెల్లడి
Vijayashanthi replies to Asaduddin Owaisi remarks on PM Modi speech

వ్యాక్సిన్ల అంశంపై నిన్న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ అనవసరం విషయంలా అభివర్ణించడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి బదులిచ్చారు. దేశంలో 135 కోట్ల భారీ జనాభా ఉన్నప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడడం సహజమే ఒవైసీ జీ... అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచం మొత్తం దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని వివరించారు.

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ కవల పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా? అని ప్రశ్నించారు. 2020 జులైలోనే వ్యాక్సిన్ కు ఆమోదం లభిస్తే, ఆ వ్యాక్సిన్ సంస్థకు ఆర్డర్ ఇవ్వకుండా ఏంచేస్తున్నారని విజయశాంతి ప్రశ్నించారు. 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వడం వీఐపీ సంస్కృతి అయితే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ సంస్కృతి కోసమా? అని విజయశాంతి ట్విట్టర్ లో విమర్శించారు.