Cooper: ఆస్ట్రేలియాలో అతిపెద్ద డైనోసార్ అవశేషాలు

World biggest dinosaur species
  • కొన్ని కోట్ల ఏళ్ల కిందట జీవించిన డైనోసార్లు
  • కాలక్రమంలో అంతరించిపోయిన జీవులు
  • 2006లో క్వీన్స్ లాండ్ లో బయల్పడిన అవశేషాలు
  • అప్పటినుంచి పరిశోధనల నిర్వహణ
కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద సంచరించిన అతి భారీ జీవులు డైనోసార్లు. కాలక్రమంలో వాతావరణ మార్పులతో ఈ రాక్షస బల్లుల జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. ఇప్పటికీ వీటి అవశేషాలు అక్కడక్కడా లభ్యమవుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో దొరికిన డైనోసార్ అవశేషాలు ఓ అతిపెద్ద జాతికి చెందిన డైనోసార్ అవశేషాలు అని తాజాగా గుర్తించారు.

అప్పట్లో భూభాగం ఖండాలుగా విడిపోకముందు ఆస్ట్రేలియా... అంటార్కిటికాతో కలిసి ఉండేది. ఆ సమయంలో భూమిపై జీవించిన డైనోసార్ అవశేషాలుగా వీటిని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ ఎముకలు 'కూపర్' రకం డైనోసార్ కు చెందినవని డాక్టర్ స్కాట్ హాక్నల్, రాబిన్ మెకెంజీ వెల్లడించారు. వీటి తాలూకు కొన్ని ఎముకలను తొలుత ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ కు చెందిన కొందరు పాడిరైతులు 2006లో కనుగొన్నారు. అప్పటి నుంచి వీటిపై పరిశోధనలు సాగుతున్నాయి.

ఈ అతి భారీ అవశేషాల ప్రకారం సదరు డైనోసార్ 5 నుంచి 6.5 మీటర్ల ఎత్తు, 25 నుంచి 30 మీటర్ల పొడవుతో ఓ బాస్కెట్ బాల్ కోర్డు అంత పొడవు, రెండంతస్తుల భవంతి అంత ఎత్తుతో ఉండొచ్చని అంచనా వేశారు. పురాజీవ శాస్త్రజ్ఞులు వీటికి 'ఆస్ట్రలోటైటన్ కూపరెన్సిస్' అంటూ శాస్త్రీయ నామకరణం చేశారు.
Cooper
Dinosaur
World's Biggest
Australia

More Telugu News