లక్ష్మీ నరసింహ స్వామి ఆల‌యంలో పూజ‌లు చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత‌.. వీడియో ఇదిగో

08-06-2021 Tue 12:34
  • నందిపేట్ మండలం సీహెచ్ కొండూర్ గ్రామంలో దేవాల‌యానికి వెళ్లిన క‌విత‌
  • క‌విత వెంట కుటుంబ స‌భ్యులు
  • ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా
kavita performs puja

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఈ రోజు ఉద‌యం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని సీహెచ్ కొండూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఆమెతో పాటు ప‌లువురు కుటుంబ స‌భ్యులు, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తాను పూజ‌లు చేసిన దృశ్యాల‌కు సంబంధించిన‌ వీడియోను క‌విత ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

నందిపేట్ మండలం సీహెచ్ కొండూర్ గ్రామంలోని, మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకుని, మా కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు శ్రీ జీవ‌న్ రెడ్డి, బాల‌రాజు గార్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అని క‌విత ట్వీట్ చేశారు.