సూర్య కొత్త సినిమా అప్ డేట్!

08-06-2021 Tue 11:11
  • విభిన్నమైన కథా చిత్రంలో సూర్య
  • 35 శాతం చిత్రీకరణ పూర్తి  
  • దర్శకుడిగా పాండిరాజ్
  • జులైలో టైటిల్ ప్రకటన  
Surya latest movie update

మొదటి నుంచి కూడా సూర్య విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య ఆయన చేసిన 'సూరరై పోట్రు' (ఆకాశం నీ హద్దురా) సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో ఒక వైవిధ్యభరితమైన సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను గురించి దర్శకుడు పాండిరాజ్ మాట్లాడారు.

"ఇది ఒక విభిన్నమైన కథా చిత్రం ..  ఇందులో సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. ఆయన పాత్రలో వేరియేషన్స్ ఉంటాయి. ఇంతవరకూ సూర్య ఈ తరహా కథనుగానీ .. పాత్రనుగాని చేయలేదు. ఇంతవరకూ 35 శాతం చిత్రీకరణను పూర్తిచేశాము. లాక్ డౌన్ తరువాత మళ్లీ సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నాము. కథ మేరకు పక్కా మాస్ టైటిల్ ను సెట్ చేయనున్నాము. జులైలో టైటిల్  ను ఎనౌన్స్ చేస్తాము. సూర్య అభిమానులు ఆశించేస్థాయిలో ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.