ఐ ఫోన్ నుంచి యువతి ప్రైవేటు ఫొటోలు లీక్.. రూ. 36 కోట్ల పరిహారం చెల్లించుకున్న యాపిల్!
- ఒరేగావ్ యూనివర్సిటీలో చదువుతున్న యువతి
- ఐఫోన్ రిపేరుకిస్తే అందులోని ప్రవేటు ఫొటోలు లీక్
- కోర్టుకెక్కిన బాధితురాలు
- పరిహారం చెల్లించుకున్న యాపిల్
ఫోన్‌ను మరమ్మతు చేసిన అక్కడి టెక్నీషియన్లు అందులో ఉన్న యువతి నగ్న ఫొటోలు, వీడియోలు చూసి వాటిని తస్కరించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు చూసిన యువతి స్నేహితులు విషయాన్ని ఆమెకు చేరవేయడంతో దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత యువతి కోర్టుకెక్కింది. పరిహారంగా 5 మిలియన్ డాలర్లు (రూ. 36 కోట్లు) ఇప్పించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో యాపిల్ ఆ మొత్తాన్ని యువతికి పరిహారంగా చెల్లించింది. యాపిల్ చెల్లించిన ఈ సొమ్మును సర్వీస్ సెంటర్ పెగట్రాన్ నుంచి రాబట్టుకున్నట్టు తెలుస్తోంది.