West Bengal: పశ్చిమ బెంగాల్‌లో పిడుగులతో కూడిన వర్షం.. 20 మంది బలి

  • ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం
  • పలు జిల్లాలో బీభత్సం సృష్టించిన వానలు
  • ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా విచారం
  • బాధిత కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం
20 killed in lightning strikes in West Bengal

పశ్చిమ బెంగాల్‌లో నిన్న భీకరంగా కురిసిన వర్షానికి 20 మంది బలయ్యారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు తీవ్రమైన గాలులతో కూడిన వర్షం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వానలకు 20 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

ముర్షీదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున, తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఇద్దరు పిడుగులు పడి చనిపోయినట్టు పేర్కొన్నారు. వర్షాలకు 20 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

More Telugu News