సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

08-06-2021 Tue 07:25
  • సమంతతో నెట్ ఫ్లిక్స్ ప్రాజక్ట్ 
  • 'ఆదిపురుష్'లో యంగ్ హీరో
  • రాజశేఖర్ సరసన మల్లూ బేబీ  
Net Flix to produce a web series with Samantha

*  అందాలతార సమంత నటించిన 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సీరీస్ కి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఆమెతో పలు షోలు చేయడానికి కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ కూడా ఓ సీరీస్ కోసం ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
*  ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రంలో వివిధ పాత్రలకు పలు భాషలకు చెందిన నటులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్ పాత్రను పోషిస్తుండగా, మరో ముఖ్య పాత్రకు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
*  ప్రముఖ నటుడు డా.రాజశేఖర్ కథానాయకుడుగా లలిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శేఖర్'. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరుగా 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్ ఎంపిక కాగా.. మరో నాయికగా మలయాళ భామ అను సితార నటిస్తుంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా!