WHO: కేసులు తగ్గుతున్నాయని ఆంక్షలు ఎత్తివేయడం సరికాదు: డబ్ల్యూహెచ్ఓ

  • కరోనా పరిస్థితులపై టెడ్రోస్ వ్యాఖ్యలు
  • ప్రయాణ ఆంక్షలు సడలించడంపై ఆందోళన
  • టీకాలు తీసుకోనివారు ఇబ్బందిపడతారని వెల్లడి
  • వ్యాక్సిన్ అసమానతల పట్ల విచారం
WHO Director General opines on corona situtations

కరోనా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసస్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని ఆంక్షలు ఎత్తివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇప్పటికిప్పుడు ఆంక్షలు సడలించడం ప్రమాదకరం అని పేర్కొన్నారు.  టీకాలు తీసుకోని వారి పట్ల ఇది తీవ్రముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. పలు దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ అసమానతల పట్ల విచారం వెలిబుచ్చారు. ఓవైపు పాశ్చాత్య దేశాలు వ్యాక్సిన్ల ద్వారా రక్షణ పొందుతుంటే, మరోవైపు పేద దేశాలు ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్నాయని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రపంచం రెండు భాగాలుగా మారిపోయినట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. 

More Telugu News