పూణెలో భారీ అగ్నిప్రమాదం.. 18 మంది మృతి

07-06-2021 Mon 19:49
  • శానిటైజర్ల తయారీ పరిశమ్రలో మంటలు
  • ప్రమాద సమయంలో లోపల 37 మంది
  • మంటల్ని ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
Fire broke out in pune factory 14 dead

పూణెలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్‌ తయారు చేసే ఓ రసాయన పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 18 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు కార్మికులు గల్లంతైనట్లు కంపెనీ వర్గాలు తెలిపారు.

ప్రమాదం సమయంలో మొత్తం 37 మంది పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం. భారీ ఎత్తున ఫైర్‌ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పడంలో నిమగ్నమయ్యాయి. ఇతర సహాయక సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు.