నేను కూడా ఆనందయ్య మందు తీసుకున్నా... ఇప్పటివరకు కరోనా రాలేదు: జగపతిబాబు

07-06-2021 Mon 19:48
  • పాప్యులారిటీ పొందిన ఆనందయ్య మందు
  • చాలా రోజుల కిందటే మందు తీసుకున్న జగపతిబాబు
  • మంచి జరుగుతుందనే తీసుకున్నట్టు వెల్లడి
  • ఆయుర్వేదం తప్పు చేయదని స్పష్టీకరణ
Jagapathi Babu reveals he was taken Anandaiah corona medicine

ఆనందయ్య మందుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో, టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆసక్తికర విషయం చెప్పారు. తాను కూడా ఆనందయ్య కరోనా మందు తీసుకున్నానని వెల్లడించారు. తాను చాలారోజుల కిందటే ఆనందయ్య మందు తీసుకున్నట్టు జగపతిబాబు వివరించారు. ఆనందయ్య గురించి తెలిసిన తొలినాళ్లలో ఆయన నుంచి మందు తీసుకున్నవారిలో తాను కూడా ఒకడ్నని పేర్కొన్నారు.

ప్రకృతి, భూమాత, ఆయుర్వేదం తప్పు చేయవని తన నమ్మకం అని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు వాడితే సైడ్ ఎఫెక్టులు ఉండవని తెలిసిన తర్వాతే మందు తీసుకున్నానని, ఇప్పటివరకు తనకు కరోనా రాలేదని వెల్లడించారు. ఆనందయ్య మందు గురించి ఎన్నో వీడియోలు చూసి, విశ్లేషించుకున్న తర్వాత మందు వాడానని వివరణ ఇచ్చారు. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే మందు తీసుకున్నానని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోలో మాట్లాడారు.