ఓ ఇంటివాడు కానున్న రాజ్ తరుణ్?

07-06-2021 Mon 17:54
  • కెరియర్ ఆరంభంలోనే హిట్లు 
  • ఇటీవల వరుస పరాజయాలు  
  • తగ్గుతున్న అవకాశాలు
  • రీసెంట్ గా ఇల్లు కొన్న రాజ్ తరుణ్  
Raj Tarun is going to marry in next year

సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే హీరోలు ఫస్ట్ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలని అనుకుంటారు. ఇక ద్వితీయ విఘ్నం లేకుండా రెండో సినిమా కూడా హిట్ పడితే బాగుంటుందని భావిస్తారు. కానీ మూడో సినిమాతో కూడా హిట్ అందుకున్న యంగ్ హీరోగా రాజ్ తరుణ్ కనిపిస్తాడు. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రాజ్ తరుణ్, ఆ తరువాత 'సినిమా చూపిస్త మావ' .. 'కుమారి 21F'తోను హిట్లు అందుకున్నాడు. ఆ తరువాత కూడా వెంటవెంటనే సినిమాలు చేశాడు కానీ, ఆ స్థాయి హిట్లు మాత్రం పడలేదు.

ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ జోరు తగ్గింది. అవకాశాల పరంగాను  .. సక్సెస్ లా పరంగాను ఆయన కొంత వెనకబడిపోయాడు. మళ్లీ మునుపటి స్పీడ్ చూపించడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే  హైదరాబాద్ లో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్న రాజ్ తరుణ్, త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ చెప్పకున్నప్పటికీ, వచ్చే ఏడాదిలో ఆయన పెళ్లి పక్కా అనే టాక్ మాత్రం నడుస్తోంది.