బోయపాటినే సెట్ చేయనున్న అల్లు అర్జున్!

07-06-2021 Mon 17:22
  • 'పుష్ప'  షూటింగులో అల్లు అర్జున్
  • రెండు భాగాలుగా రానున్న 'పుష్ప'
  • బోయపాటి కథ విన్న అల్లు అర్జున్
  • తదుపరి సినిమా ఆయనతోనే    
Allu Arjun next movie director is Boyapati

అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'సరైనోడు' ఒకటిగా కనిపిస్తుంది. యాక్షన్ కి .. ఎమోషన్ కి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తూ, బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదరుచూస్తున్నారు. అలాంటివారి ముచ్చట త్వరలో నెరవేరనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు రెడీ కానుందట.

'పుష్ప' సినిమా తరువాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకున్నాడు. కానీ 'పుష్ప'ను రెండు భాగాలుగా తీయాలనుకోవడంతో, కొరటాల తన కథలో ఎన్టీఆర్ ను సెట్ చేసుకున్నాడు. దాంతో 'పుష్ప' పూర్తికాగానే తనకి బోయపాటి అందుబాటులో ఉంటాడని భావించిన అల్లు అర్జున్ .. ఆయననే సెట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. 'పుష్ప' రెండు భాగాలు పూర్తయ్యేలోగా బోయపాటి మిగతా పనులన్నీ పూర్తిచేసుకుని సిద్ధంగా ఉంటాడన్న మాట.