మరింత శాంతించిన కరోనా మహమ్మారి...  ఏపీలో 5 వేలకు దిగువన రోజువారీ కేసులు

07-06-2021 Mon 17:11
  • గత 24 గంటల్లో 64,800 కరోనా పరీక్షలు
  • 4,872 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 961 కేసులు, 14 మరణాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 86 మంది మృతి
Huge dip in AP Corona cases

ఏపీలో గడచిన 24 గంటల్లో అతి తక్కువ సంఖ్యలో రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. 64,800 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 4,872 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏ ఒక్క జిల్లాలో కూడా కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటలేదు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 961 కరోనా కేసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 810 మందికి కరోనా సోకగా, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 13,702 మంది కోలుకోగా, 86 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 13 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,63,211 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,37,149 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,14,510 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 11,552కి చేరింది.