ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

07-06-2021 Mon 15:37
  • ఇటీవల పరిణామాలపై లేఖ 
  • ఓ ఎంపీని తొలిసారి సెక్షన్ 124ఏ కింద అరెస్ట్ చేశారని వెల్లడి
  • ఈ సెక్షన్ రద్దుకు సహకరించాలని విజ్ఞప్తి
  • తనను చిత్రహింసలు పెట్టారంటూ లేఖలో వివరణ
MP Raghurama Krishna Raju wrote Delhi CM Arvind Kejriwal

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. సెక్షన్ 124ఏ రద్దుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటులో డిమాండ్ చేయాలని రఘురామ తన లేఖలో కోరారు. ఆప్ సభ్యులు పార్లమెంటులో దీనిపై గళం వినిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఓ ఎంపీని 124ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారని తెలిపారు.  మే 14న తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు క్రూరంగా హింసించారని వివరించారు. సెక్షన్ 124ఏను రద్దు చేసేందుకు పూర్తి మద్దతు ఇవ్వాలని రఘురామకృష్ణరాజు తన లేఖలో కోరారు.

రఘురామ తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టారన్న విషయాన్ని లేఖల రూపంలో రాజకీయ ప్రముఖుల దృష్టికి తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో పలువురు పెద్దలతో భేటీ అవుతున్నారు.