ఆనందయ్య ఇచ్చే 'కె' మందును కూడా తక్షణమే పంపిణీ చేయాలి: ఏపీ హైకోర్టు

07-06-2021 Mon 14:48
  • కరోనా ఔషధాలు పంపిణీ చేస్తున్న ఆనందయ్య
  • గతంలో పీ,ఎల్,ఎఫ్ మందులకు కోర్టు అనుమతి
  • కంట్లో చుక్కల మందు, కె మందుకు అనుమతి నిరాకరణ
  • తాజాగా హైకోర్టులో విచారణ
  • కె మందుకు గ్రీన్ సిగ్నల్
High court gives nod to Anandaiah K medicine

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి బొనిగే ఆనందయ్య పంపిణీ చేసే మందుల్లోని 'కె' రకం ఔషధానికి కూడా హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఆనందయ్య ఇచ్చే 'కె' రకం మందును వెంటనే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అటు, కంట్లో వేసే చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ఇటీవల ఆనందయ్య తయారుచేసే పీ, ఎఫ్, ఎల్ మందులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేదు. 'కె' మందుకు కూడా నాడు అనుమతి ఇవ్వలేదు. తాజాగా వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 'కె' మందు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాల్లేవని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.