mango: ఒక్కోటి రూ.1,000 పలుకుతున్న నూర్జహాన్ మామిడిపండు!

  • మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలో కాసే ‘నూర్జహాన్‌’ మామిడి పండ్లు
  • ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఫుల్‌
  • ఒక్కో పండు బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోలు
noorjahan mango rate 1000

సాధార‌ణంగా మామిడి పండ్ల ధ‌ర కిలో రూ.100 వ‌ర‌కు ఉంటుంది. అయితే, ‘నూర్జహాన్‌’ మామిడి పండ్లు మాత్రం చాలా ప్ర‌త్యేకం. వాటి ధ‌ర ఒక్కోటి గ‌రిష్ఠంగా రూ.1,000కి అమ్ముడుపోతోంది.

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని మామిడి తోట‌ల్లో ‘నూర్జహాన్‌’ మామిడి కాయలు కాశాయి. వాటిని రైతులు ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి  పెట్టారు. వాటి ధ‌ర ఒక్కోటి రూ.500 నుంచి రూ.1,000 మ‌ధ్య ఉంది. త‌న‌ తోటలోని మూడు నూర్జహాన్‌ చెట్లకు 250 మామిడి కాయలు కాశాయని అక్క‌డి రైతు చెప్పాడు. ఈ పండ్లన్నీ ఇప్పటికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ స‌హా పలు ప్రాంతాల వారు బుక్‌ చేసుకున్నారని తెలిపాడు.

ఈ సారి ఒక్కో నూర్జహాన్‌ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉందని అన్నాడు. కాగా, 2019లో నూర్జహాన్‌ మామిడి గరిష్ఠంగా ఒక్కోటి రూ.1,200కి అమ్ముడుపోయింది. ఒక్కో మామిడి పండు అంత గ‌రిష్ఠ ధ‌ర‌కి అమ్ముడు పోవ‌డం అదే తొలిసారి.

ఈ మామిడి పండ్లను పండించే అక్కడి తోటల్లో గత ఏడాది సానుకూల వాతావరణం లేకపోవడంతో అప్ప‌ట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మ‌రో రైతు చెప్పాడు. ఈ సారి మాత్రం పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయని వివ‌రించాడు. ఆఫ్ఘన్ మూలాలకు చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే పండిస్తారు.

More Telugu News