వచ్చే నెలలో సెట్స్ పైకి రవితేజ!

07-06-2021 Mon 10:05
  • ముగింపు దశలో 'ఖిలాడి'
  • 'కిక్' తరహాలో త్రినాథరావు సినిమా
  • లైన్లోనే ఉన్న శరత్ మండవ  
Raviteja new movie starts from next month

రవితేజ ఈ ఏడాది ఆరంభంలోనే అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాడు. 'క్రాక్' సినిమా ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ ఉత్సాహంతోనే ఆయన 'ఖిలాడి'ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. చాలా వేగంగా ఈ సినిమాను ఆయన ముగింపుదశకి తీసుకెళ్లాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. బ్యాలెన్స్ ఉన్న కాస్త చిత్రీకరణను ఈ నెల చివరికి పూర్తిచేయనున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి కథానాయికలుగా అలరించనున్నారు.

ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత  రవితేజ ఎంత మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. వచ్చేనెలలో త్రినాథరావు నక్కిన సినిమాను మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు. 'కిక్' తరహాలో ఈ సినిమా యాక్షన్ తో కూడిన నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలోను ఆయన సరసన ఇద్దరు కథానాయికలు కనువిందు చేయనున్నారట. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. దాని ప్రోగ్రెస్ ఎంతవరకూ వచ్చిందనేది తెలియాల్సి ఉంది.