సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

07-06-2021 Mon 07:31
  • ఓటీటీ ద్వారా కీర్తి సురేశ్ సినిమా 
  • 'అఖండ' నిర్మాతలు ఫిక్సయ్యారట!  
  • అమితాబ్ తో వర్మ మరో ప్రాజక్టు
Keerti Suresh film to be released through OTT

*  లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్ పై రిలీజ్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'జీ5' భారీ రేటును ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, కీర్తి సురేశ్ నటించిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' సినిమాలు కూడా ఆమధ్య ఓటీటీలోనే రిలీజయ్యాయి.
*  నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ' విజయదశమికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని నిర్మాతలు తాజాగా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో షెడ్యూల్ షూటింగ్ మిగిలివుంది.
*  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి నటించనున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతున్నట్టు, వచ్చే ఏడాది ఇది సెట్స్ కు వెళ్లనున్నట్టు సమాచారం.