స్పీడు పెంచిన డీకే అరుణ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సుదీర్ఘ భేటీ

07-06-2021 Mon 07:10
  • నాలుగు గంటలపాటు భేటీ
  • అరుణ ఆహ్వానానికి సానుకూల స్పందన
  • త్వరలోనే నిర్ణయం చెబుతానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
DK Aruna met with Komatireddy Raj Gopal Reddy

తెలంగాణ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జోరు పెంచారు. పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో ఇటీవల సమావేశమైన అరుణ.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో దాదాపు నాలుగు గంటలపాటు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయనను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అరుణ ఆహ్వానానికి కోమటిరెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారని సమాచారం. కాగా, రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు ఖాయమని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అరుణతో రాజగోపాల్‌రెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.