చంద్రగిరి ముక్కోటి తీర్థంలో ఆనందయ్య ఔషధం తయారీ

06-06-2021 Sun 20:47
  • చిత్తూరు జిల్లాలోనూ ఆనందయ్య మందు
  • కృష్ణపట్నం నుంచి 10 రకాల మూలికలు పంపిన ఆనందయ్య
  • 6 రకాల మూలికలు అందించిన చంద్రగిరి ప్రజలు
  • రేపటి నుంచి మందు పంపిణీ
Anandaiah medicine manufactures in Chandragiri

నెల్లూరు జిల్లాలోనే కాకుండా చిత్తూరు జిల్లాలోనూ ఆనందయ్య ఔషధం తయారుచేస్తున్నారు. చంద్రగిరి ముక్కోటి తీర్థంలో ఆనందయ్య మందు తయారుచేస్తున్నారు. ముక్కోటి తీర్థంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే 'పీ' రకం ఔషధాన్ని రూపొందిస్తున్నారు. దీని కోసం ఆనందయ్య కృష్ణపట్నం నుంచి 10 రకాల మూలికలు పంపించారు. చంద్రగిరి ప్రజల నుంచి మరో 6 రకాల మూలికలను సేకరించారు. ఈ మందు తయారీలో మొత్తం 16 రకాల ఔషధ మూలికలు వినియోగిస్తున్నారు.

ఈ మందును 6 మండలాల్లోని 1,600 గ్రామాల ప్రజలకు పంపిణీ చేయనున్నారు. 1.60 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఔషధాన్ని రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఇంటింటికీ మందు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.