తెలంగాణలో కొత్తగా 1,436 పాజిటివ్ కేసులు, 14 మరణాలు

06-06-2021 Sun 20:02
  • గత 24 గంటల్లో 97,751 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 184 కొత్త కేసులు
  • కామారెడ్డి జిల్లాలో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో 14 మంది మృతి
Telangana corona second wave details

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 97,751 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 1,436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 184 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 148, నల్గొండ జిల్లాలో 118 కేసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఓ జిల్లాలో కేసులేవీ రాకపోవడం ఇదే ప్రథమం!

అదే సమయంలో 3,614 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,91,170 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,60,776 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 27,016 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 3,378కి చేరింది. కాగా, తెలంగాణలో రికవరీ రేటు 94.85 శాతానికి పెరిగింది.


.