రఘురామకృష్ణరాజు లేఖకు స్పందించిన కేరళ ఎంపీ ప్రేమచంద్రన్

06-06-2021 Sun 14:52
  • ఇటీవల రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
  • తన పట్ల దారుణంగా వ్యవహరించారన్న రఘురామ
  • మద్దతు ఇవ్వాలంటూ ఎంపీలకు లేఖ
  • రఘురామపై దాడి అమానుషమన్న ప్రేమచంద్రన్
Kerala MP Premachandran responds to Raghurama Krishnaraju letter

ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేయడం, ఆపై వారు తనతో వ్యవహరించిన తీరును నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖల రూపంలో పలువురు ప్రముఖులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆయన లోక్ సభ స్పీకర్ కు, అన్ని పార్టీల ఎంపీలకు లేఖ రాశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా, రఘురామరాజు లేఖ పట్ల కేరళ ఎంపీ ప్రేమచంద్రన్ స్పందించారు.

రఘురామపై సీఐడీ తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాప్రతినిధిపై దాడి చేయడం అనాగరికమని అభివర్ణించారు. ఇది క్రూరమైన, అమానవీయ చర్య అని, ఇది పార్లమెంటుకు జరిగిన అవమానం అని ప్రేమచంద్రన్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో తప్పక లేవనెత్తుతానని తెలిపారు. ఈ అంశంలో ఎంపీ రఘురామకృష్ణరాజుకు మద్దతు ప్రకటిస్తున్నానని వెల్లడించారు.