Atchannaidu: ఆనందయ్య అనుమతి లేకుండా వైసీపీ నేతలు వెబ్ సైట్ తయారుచేసి దొంగ వ్యాపారం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

Atchannaidu fires in YCP leaders in Ananandaiah medicine row
  • ఆనందయ్య మందు నేపథ్యంలో మరో వివాదం
  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
  • కాకాని, సోమిరెడ్డి మధ్య విమర్శల పర్వం
  • స్పందించిన అచ్చెన్నాయుడు
  • సోమిరెడ్డిపై కేసు దుర్మార్గమని వ్యాఖ్యలు
ఆనందయ్య మందు పంపిణీకి ఓవైపు ఏర్పాట్లు పూర్తి కాగా, మరోవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. ఆనందయ్య మందుతో వైసీపీ నేతలు దొంగ వ్యాపారానికి తెరదీశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ తయారుచేసి మందు ఒక్కో ప్యాకెట్ ను రూ.167కి అమ్ముకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాకాని అనుచరుడికి చెందిన శేశ్రిత టెక్నాలజీస్ అనే సంస్థ ఈ విధంగా అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి, ప్రశ్నిస్తున్న సోమిరెడ్డిపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.

బెదిరించేవాళ్లను వదిలేసి, కుట్రను బహిర్గతం చేసిన సోమిరెడ్డిపై ఛీటింగ్, దొంగతనం, ఫోర్జరీ కేసులేంటని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడే మందుతో వ్యాపారం చేయాలన్న నీచానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Atchannaidu
Ananandaiah Medicine
Kakani
Somireddy
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News