తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖ‌రారు.. లాక్‌డౌన్ ఎత్తివేత‌పై చ‌ర్చించే చాన్స్‌!

06-06-2021 Sun 12:44
  • ఎల్లుండి మధ్యాహ్నం 2 గం.కు మంత్రివర్గ సమావేశం
  • రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్యం, నీటిపారుదలపై చర్చ
  • రైతుబంధు, వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ
telangana cabinet to meet on tuesday

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖ‌రారైంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌/ పొడిగింపు, కరోనా పరిస్థితులు, వైర‌స్ క‌ట్ట‌డికి శాఖల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, క‌రోనా మూడోద‌శ విజృంభ‌ణ‌కు స‌న్న‌ద్ధం, వైద్యం, నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.  

అలాగే, రైతుబంధు, వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జ‌ర‌పనున్నారు. ఈ వానాకాలం సాగునీరు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టిన చర్యలు, తదితర అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది.