మిస్ట‌ర్ బీన్ ఇక‌లేరు అంటూ అస‌త్య వార్తలు!

06-06-2021 Sun 11:57
  • మిస్ట‌ర్ బీన్‌గా అంద‌రికీ సుప‌రిచిత‌మైన హాస్య‌న‌టుడు రోవాన్ ఎట్కిన్సన్
  • గ‌త నెల 29న నుంచి ఫేస్‌బుక్ లో అస‌త్య‌ వార్త చ‌క్క‌ర్లు
  • షేర్ చేస్తోన్న వేలాది మంది
fake news about mr bean

మిస్ట‌ర్ బీన్‌గా అంద‌రికీ సుప‌రిచిత‌మైన హాస్య‌న‌టుడు రోవాన్ ఎట్కిన్సన్ మృతి చెందాడంటూ అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త నెల 29న నుంచి ఫేస్‌బుక్ లో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. చాలా మంది ఈ వార్త‌ను షేర్ చేస్తున్నారు. అది నిజ‌మేన‌ని న‌మ్ముతోన్న చాలామంది నెటిజ‌న్లు గొప్ప హాస్య‌న‌టుడిని కోల్పోయామంటూ సంతాపం తెలుపుతున్నారు.

మిస్ట‌ర్ బీన్ పేరిట ఉన్న ఫేస్‌బుక్ పేజీలో ఈ పోస్టు చేశారు. అది న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతా అని తెలియ‌క చాలా మంది అందులోని వార్త‌ను న‌మ్ముతున్నారు. చాలా మంది నుంచి అభ్యంత‌రాలు రావ‌డంతో చివ‌ర‌కు ఆ పేజీ నిర్వాహకులు ఆ పోస్ట్ ను పేజీ నుంచి డిలీట్ చేశారు.

మిస్ట‌ర్ బీన్ మృతి చెందాడ‌ని జ‌రుగుతోన్న‌ ప్ర‌చారంలో నిజం లేద‌ని అనేక ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్లు స్ప‌ష్టం చేశాయి. కాగా, మిస్ట‌ర్ బీన్‌గా బుల్లితెర‌, వెండితెర ప్రేక్ష‌కుల‌ను దశాబ్దాలుగా అల‌రించిన‌ ఎట్కిన్సన్ మృతి చెందాడంటూ ప‌దే ప‌దే ఇటువంటి న‌కిలీ వార్త‌లు ప్ర‌చారం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.