హైద‌రాబాద్‌లో అతి పెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌.. హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో 40 వేల మందికి వేస్తోన్న సిబ్బంది

06-06-2021 Sun 11:12
  • సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రి  ఆధ్వర్యంలో వ్యాక్సిన్
  • 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ వేస్తోన్న సిబ్బంది
  • పెద్ద ఎత్తున వ‌స్తోన్న‌ ప్రజలు
  • సుమారు 500 కౌంటర్లు ఏర్పాటు  
vaccination drive in hyderabad

హైద‌రాబాద్‌లో అతి పెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఈ రోజు 40 వేల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, పోలీసులు, మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రి ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్ వేస్తున్నారు.


దీంతో అక్క‌డ‌కు పెద్ద ఎత్తున ప్రజలు వ‌స్తున్నారు. వ్యాక్సిన్ కోసం సుమారు 500 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైన ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఈ రోజు రాత్రి 9 గంటల వరకు జ‌రుగుతుంది.  హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్ ప్రాంతంలో రోడ్డుపైకి పెద్ద ఎత్తున వాహ‌నాలు వ‌చ్చాయి.