శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 53 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!

06-06-2021 Sun 09:30
  • దోహా నుంచి వచ్చిన జాంబియా మహిళ
  • 8 కిలోల హెరాయిన్ పట్టివేత
  • నిందితురాలిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు
Drugs Worth 53 Crores Seized In Shamshabad Airport

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. జాంబియాకు చెందిన మహిళ దోహా నుంచి నిన్న ఉదయం శంషాబాద్‌కు వచ్చింది. అనుమానాస్పదంగా కనిపించిన ఆమెను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి.

ఆమె నుంచి 8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీని మొత్తం విలువ రూ. 53 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. జాంబియాకు చెందిన నిందితురాలి పేరు ముకుంబా కరోల్‌ అని తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.