కోలుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

06-06-2021 Sun 07:01
  • గత నెలలో కరోనా బారినపడి కోలుకున్న స్పీకర్
  • ఈ నెలలో మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిక
  • పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు
AP Speaker Tammineni Sitaram Discharged from Hospital

కరోనా బారినపడి కోలుకున్న అనంతరం తిరిగి అనారోగ్యానికి గురై  ఆసుపత్రిలో చేరిన ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం నిన్న డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో కరోనా బారినపడిన సీతారాం ఆ తర్వాత కోలుకున్నారు. అయితే, జ్వరంతోపాటు శరీరంలో చక్కెర స్థాయులు పెరగడంతో ఈ నెల ఒకటో తేదీన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకున్నారు.

తాజాగా వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి సమస్యలు లేవని తేల్చారు. స్పీకర్ పూర్తిగా కోలుకున్నారని, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి తెలిపారు. దీంతో ఆయనను డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు.