హరిత నగరాల ద్వారానే మెరుగైన జీవనం: చంద్రబాబు

06-06-2021 Sun 06:47
  • నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • అమరావతి లాంటి హరిత నగరాల నిర్మాణానికి ముందు చూపు అవసరం
  • ప్రజాజీవితం పర్యావరణంతో ముడిపడి ఉండాలి
Better life through green cities says Chandrababu

హరిత నగరాల ద్వారానే మెరుగైన జీవనం, చిన్నారులకు అత్యుత్తమ భవిష్యత్తు సాధ్యమవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నిత్య జీవితంలో పర్యావరణాన్ని భాగం చేసేందుకు ఉన్న ఏకైక పరిష్కారం హరిత నగరాల నిర్మాణమేనన్నారు.

అమరావతి వంటి హరిత నగరాలను నిర్మించాలంటే అందుకు బోల్డంత ముందు చూపు అవసరమని పేర్కొన్నారు. అమరావతిని ఆదర్శ హరిత నగరంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రణాళికలు వేశామన్నారు. ప్రజా జీవితంతోపాటు జీవనోపాధి కూడా పర్యావరణంతో ముడిపడి ఉండేలా ఎన్నో ప్రణాళికలు రచించామని చంద్రబాబు అన్నారు.