తెలంగాణలో కొత్తగా 2,070 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

05-06-2021 Sat 20:33
  • తెలంగాణలో బాగా తగ్గిన కొత్త కేసులు
  • గత 24 గంటల్లో 1,38,182 కరోనా పరీక్షలు
  • గ్రేటర్ హైదరాబాదులో 245 పాజిటివ్ కేసులు
  • రాష్ట్రంలో 18 మంది మృతి
  • 94.47 శాతానికి పెరిగిన రికవరీ రేటు
Telangana covid update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,38,182 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,070 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 245 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 172, నల్గొండ జిల్లాలో 156 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 8 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,762 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,89,734 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,57,162 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 29,208 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,364గా నమోదైంది. రికవరీ రేటు మరికాస్త పెరిగి 94.47 శాతానికి చేరింది.