మళ్లీ రంగంలోకి దిగుతోన్న 'పొన్నియిన్ సెల్వన్' టీమ్

05-06-2021 Sat 19:00
  • చారిత్రక నేపథ్యంలో మణిరత్నం తాజా చిత్రం
  • భారీ తారాగణంతో 'పొన్నియిన్ సెల్వన్'
  • ఈ నెల 15 నుంచి తదుపరి షెడ్యూల్
Ponniyin Selvan team is ready for next schedule

దక్షిణాది దర్శకులలో మణిరత్నం స్థానం ప్రత్యేకం. ఆయన ఎంచుకునే కథలు .. తెరపై వాటిని ఆయన ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటాయి. అందువలన మణిరత్నం సినిమాలు జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటాయి. ఈ సారి ఆయన చారిత్రక నేపథ్యంతో కూడిన కథను ఎంచుకుని రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఆయన కూడా ఒక భాగస్వామిగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలాకాలమే అయింది.

మధ్యప్రదేశ్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో షూటింగు ఆపేశారు. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి షూటింగు మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మధ్యప్రదేశ్ వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. మణిరత్నం నుంచి రానున్న పాన్ ఇండియా మూవీ కావడంతో, ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.