Andhra Pradesh: ఏపీలో మరో 10,373 కరోనా పాజిటివ్ కేసులు, 80 మరణాలు

  • గత 24 గంటల్లో 88,441 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరిలో 1,880 కొత్త కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 309 కేసులు
  • చిత్తూరు జిల్లాలో 12 మంది మృతి
Corona Second Wave details of Andhra Pradesh

ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏపీలో మహోగ్రంగా సాగిన కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంగా నియంత్రణలోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 88,441 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,373 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,880 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,728 కేసులు, అనంతపురం జిల్లాలో 1,002 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 309 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 15,958 మంది కరోనా నుంచి కోలుకోగా, 80 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 12 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 17,49,363 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,09,879 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,28,108 మందికి చికిత్స కొనసాగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 11,376కి పెరిగింది.

More Telugu News