తన అభిమానుల సేవలను వీడియో రూపంలో పంచుకున్న రామ్ చరణ్

05-06-2021 Sat 18:15
  • కరోనా వేళ అభిమానుల సేవా కార్యక్రమాలు
  • ఫ్యాన్స్ సేవలకు రామ్ చరణ్ ఫిదా
  •  అభిమానులకు పేరుపేరునా శుభాభినందనలు
  • అంకితభావంతో పనిచేశారంటూ కితాబు
Ram Charan pleased with his fans social service during corona pandemic

కరోనా సంక్షోభం సమయంలో తన అభిమానులు చేసిన సామాజిక సేవాకార్యక్రమాల పట్ల టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ముగ్ధుడయ్యారు. మీ అందరి అంకిత భావానికి ధన్యవాదాలు అంటూ ప్రత్యేకంగా ఓ ప్రకటన చేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎంతోమందికి సాయం చేశారని, అభిమానులందరికీ పేరుపేరునా శుభాభినందనలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

"అభిమానులు ఈ కొవిడ్-19 సమయంలో ఎంతో కష్టపడి సమాజసేవ చేస్తుండడాన్ని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సాయపడడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పనిచేశారు" అని కొనియాడారు. ఈ సందర్భంగా అభిమానుల సేవాకార్యక్రమాల ఫొటోలతో కూడిన ఓ వీడియోను కూడా రామ్ చరణ్ పంచుకున్నారు.