ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖాతాకు బ్లూ టిక్ ను పునరుద్ధరించిన ట్విట్టర్

05-06-2021 Sat 18:03
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కూడా ఇదే అనుభవం
  • బ్లూ టిక్ తొలగించి ఆపై పునరుద్ధరణ
  • మోహన్ భగవత్ ఖాతా బ్లూ టిక్ కూడా తొలగింపు
  • ఇతర ఆర్ఎస్ఎస్ ప్రముఖుల ఖాతాలకూ ఇదే పరిస్థితి
Twitter restores blue tick mark for Mohan Bhagwat account

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇవాళ పలువురు భారత ప్రముఖుల ఖాతాలకు బ్లూ టిక్ (వెరిఫికేషన్ మార్క్) ను తొలగించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు మరో నలుగురు సంఘ్ పరివార్ పెద్దల ఖాతాలకు కూడా బ్లూ టిక్ లు తొలగించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖాతాకు సైతం బ్లూ టిక్ ను తొలగించి, కాసేపటి తర్వాత పునరుద్ధరించింది.

తాజాగా, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ ట్విట్టర్ ఖాతాకు కూడా బ్లూ టిక్ ను పునరుద్ధరించింది. ఆయనతో పాటు కృష్ణగోపాల్ తదితర ఆర్ఎస్ఎస్ ప్రముఖుల ఖాతాల బ్లూ టిక్ లను పునరుద్ధరించింది. ఓవైపు కేంద్రంతో ట్విట్టర్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బ్లూ టిక్ ల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది.