టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన చిరంజీవి

05-06-2021 Sat 16:20
  • శంకర్ యోగక్షేమాలను కనుక్కున్న చిరంజీవి
  • కరోనా నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరిక
  • ఇచ్చిన మాట మేరకు జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకును ఇచ్చానన్న చిరు
Chiranjeevi calls TRS MLA Shankar Nayak

టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. శంకర్ ఎలా ఉన్నారు? కుటుంబసభ్యులు బాగున్నారా? అని చిరంజీవి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీరు ప్రజల్లో బాగా తిరుగుతారని... కరోనా నేపథ్యంలో పరిస్థితులు బాగోలేవని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. మరోవైపు శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ... మీ మాట కోసం మీ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును ఇచ్చానని తనతో చిరంజీవి అన్నారని చెప్పారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున తమ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును కేటాయించడం పట్ల చిరంజీవికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.