ట్విట్టర్​ కు కేంద్రం ఫైనల్​ వార్నింగ్​

05-06-2021 Sat 13:56
  • భారతీయ అధికారిని నియమించాలని ఆదేశం
  • రూల్స్ ను పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
  • తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్
Government of India gives final notice to Twitter for compliance with new IT rules

ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఐటీ చట్టం నిబంధనల ప్రకారం భారతీయుడిని గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది. వెంటనే కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసని హెచ్చరించింది.

కొత్త రూల్స్ ను పాటించకపోతే ఐటీ చట్టం 2000లోని 79 సెక్షన్ ప్రకారం అందుబాటులో ఉన్న లయబిలిటీ ఉపశమనాన్ని రద్దు చేస్తామంది. కొత్త ఐటీ చట్టం, ఇతర చట్టాల ప్రకారం ట్విట్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కాగా, కొన్ని వారాలుగా కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కొత్త ఐటీ చట్టంపై మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ను తొలగించిన సంస్థ.. ఆ వేడి మరింత పెరిగేలా చేసింది. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే బ్లూ టిక్ ను పునరుద్ధరించింది.