Twitter: ట్విట్టర్ ను నిరవధికంగా నిషేధించిన నైజీరియా

  • నైజీరియా అధ్యక్షుడి ఖాతాను ఆపిన ట్విట్టర్
  • ట్విట్టర్ పై కన్నెర్రజేసిన నైజీరియా
  • ట్విట్టర్ నే బ్యాన్ చేసిన వైనం
Nigeria bans Twitter

ట్విట్టర్ పై ఆఫ్రికా దేశం నైజీరియా కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ట్విట్టర్ కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నిరవధికంగా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ సమాచార శాఖ తెలిపింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ అకౌంటన్ ను ట్విట్టర్ ఆపేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 తమ రూల్స్ ను ముహమ్మదు అతిక్రమించారంటూ ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. సాక్షాత్తు అధ్యక్షుడి ఖాతానే స్తంభింపజేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఫైర్ అయింది. ఇటీవలి కాలంలో ట్విట్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మంది ప్రముఖులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. తాజాగా మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఖాాతాకు ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తగానే వెంటనే తప్పును సరిదిద్దుకుంది.

More Telugu News