పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'మిర్చి' భామ రిచా

05-06-2021 Sat 12:52
  • అమెరికా బిజెనెస్ స్కూల్లో ప్రేమలో పడ్డ రిచా
  • పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన వైనం
  • కుమారుడికి లుకా షాన్ అని పేరు పెట్టినట్టు వెల్లడి
Richa gives birth to baby boy

సూపర్ హిట్ మూవీ 'మిర్చి'లో ప్రభాస్ సరసన మెరిసిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ తల్లి అయ్యారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు.

చిన్నారికి 'లుకా షాన్' అనే పేరు పెట్టినట్టు రిచా తెలిపారు. చిన్నారి రాకతో తామందరం ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రూపురేఖల్లో అచ్చం తన నాన్న మాదిరే ఉన్నాడని చెప్పారు.

అమెరికాలో పుట్టిపెరిగిన 'లీడర్' సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిచా... మొదటి సినిమాతోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. చివరగా 'భాయ్' సినిమాలో నటించారు. అనంతరం ఉన్నత విద్య కోసం తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడి బిజినెస్ స్కూల్లో సహాధ్యాయి జోను ప్రేమించారు. ఆ తర్వాత వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించలేదు