హైద‌రాబాద్‌లో నాలాలో ప‌డిపోయిన బాలుడు.. వేగంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ మృతి

05-06-2021 Sat 12:16
  • న్యూబోయిన్‌ప‌ల్లిలో ఘ‌ట‌న‌
  • బాలుడి ఇంటి స‌మీపంలో నాలా
  • మ‌ర‌మ్మ‌తు ప‌నులు జ‌రుగుతుండ‌గా ప‌డ్డ బాలుడు
boy dies in nala

హైద‌రాబాద్‌లోని న్యూబోయిన్‌ప‌ల్లిలో నాలాలో ఓ బాలుడు ప‌డిపోయాడు. స‌హాయ‌క బృందాలు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని బాలుడి ఆచూకీ గుర్తించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిపాయి. అయితే, నాలాలో ఆ బాలుడిని గుర్తించి బ‌య‌ట‌కు తీసేలోపే అత‌డు ప్రాణాలు కోల్పోయాడు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే... న్యూబోయినపల్లిలోని ఆనంద్‌నగర్‌ కాలనీలో నాలా మ‌ర‌మ్మ‌తు ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆ నాలా  ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడి ఇంటి స‌మీపంలోనే ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆనంద్ సాయి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు.

దీనిపై స్థానికులు  పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి స‌మాచారం అందించారు. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న స‌హాయ‌క బృందాలు నాలా ప్ర‌వ‌హిస్తోన్న స‌మీప ప్రాంతం మొత్తం బాలుడి కోసం గాలించారు. బాలుడి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు.