Varla Ramaiah: జగన్ విషయంలో సీబీఐకి ఎందుకీ వ్యత్యాసం?: వర్ల రామయ్య

Why the difference to the CBI in the case of Jagan asks Varla Ramaiah
  • చట్టం ఎవరికీ చుట్టం కాదు
  • వాయిదాలకు జగన్ రాకపోయినా సీబీఐ కిమ్మనదు
  • విచారణ సరిగా జరక్కపోయినా పట్టించుకోదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య అసహనం వ్యక్తం చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఆయన అన్నారు. పేదవారికి, ధనవంతులకు, అధికారంలో ఉన్నవారికి, లేనివారికీ, అందరికీ చట్టం సమానమే అని చెప్పారు.

కానీ జగన్ విషయంలో మాత్రం సీబీఐ సమ దృష్టితో వ్యవహరించడం లేదని విమర్శించారు. కోర్టు వాయిదాలకు జగన్ రాకపోయినా కిమ్మనదని అన్నారు. కోర్టులో ఆయన కేసుల విచారణ సరిగా జరక్కపోయినా పట్టించుకోదని దుయ్యబట్టారు. జగన్ విషయంలో ఈ వ్యత్యాసం ఎందుకో? ఏమో? అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News