వ్యాక్సినేషన్​ లో అమెరికాను దాటేసిన భారత్​

05-06-2021 Sat 11:32
  • ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా ముందుకు
  • 17.2 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశామన్న కేంద్రం
  • మరింత మందికి వేయాలంటే టైం పడుతుందని వెల్లడి
India Overtakes US Has More Number Of People With 1st Dose Of Vaccine

వ్యాక్సినేషన్ లో అమెరికాను భారత్ దాటేసింది. అయితే, మొత్తంగా కాదు. ఫస్ట్ డోస్ తీసుకున్న వారి విషయంలో మన దేశం ఈ ఘనత సాధించింది. ఎక్కువ మందికి మొదటి డోసు వేసిన దేశంగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు.

ఇప్పటిదాకా 17.2 కోట్ల మంది కరోనా టీకా ఫస్ట్ డోసు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో అమెరికాను దాటామన్నారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టింది కదా అని.. జనవరి, ఫిబ్రవరిల్లో చూపించిన నిర్లక్ష్యాన్నే ఇప్పుడూ ప్రదర్శిస్తే మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుందని హెచ్చరించారు.