'అలమేలుమంగ' విషయంలో తేజ అలా ఫిక్స్ అయ్యాడట!

05-06-2021 Sat 11:01
  • విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా తేజ
  • గోపీచంద్ జోడీగా తొలిసారి కీర్తి సురేశ్
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్
Alamelumanga Venkataramana movie shooting starts from August

తేజ తయారు చేసుకునే కథలు డిఫరెంట్ గా ఉంటాయి. 'సీత' తరువాత ఆయన ఒక కథను రెడీ చేసుకున్నారు. అదే .. 'అలమేలుమంగ .. వెంకటరమణ'. టైటిల్ ను బట్టే ఈ కథ అంతా కూడా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుందనే  విషయం అర్థమవుతోంది. గోపీచంద్ - కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను, ఈ నెల నుంచే సెట్స్ పైకి తీసుకువెళ్లాలని తేజ అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో, ఆగస్టు ఫస్టు వీక్ లో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట.

'నేనేరాజు నేనేమంత్రి' .. 'సీత' సినిమాల్లో కాజల్ ను తీసుకున్న తేజ, ఈ సినిమాలోను కాజల్ ను సెట్ చేయాలనే చూశారు .. కానీ కుదరలేదు. ఆ తరువాత సాయిపల్లవితోను సంప్రదింపులు నడిచాయి. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన, ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. దాంతో కీర్తి సురేశ్ లైన్లోకి వచ్చింది. 'జయం' .. 'నిజం' సినిమాల్లో గోపీచంద్ ను విలన్ గా చూపించిన తేజ, ఈసారి హీరోగా చూపిస్తూ చేయనున్న సినిమా కావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.