Pavan Kalyan: పూరితో పవన్ సినిమా ఉన్నట్టే!

Puri movie is confirmed with Pavan Kalyan
  • గతంలో వచ్చిన 'బద్రి' సూపర్ హిట్
  • నిరాశపరిచిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు'
  • మూడో సినిమాకి మొదలైన ప్రయత్నాలు

పూరి జగన్నాథ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'బద్రి' ఇప్పటికీ యూత్ పై ఒక టానిక్ లా ప్రభావం చూపుతూనే ఉంది. ఆ తరువాత కూడా ఇద్దరూ కలిసి 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాను చేశారు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సెట్ కానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. గతంలో తాను మహేశ్ బాబుకి వినిపించిన 'జన గణ మన' కథనే, పవన్ తో పూరి చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఇది 'జన గణ మన' కథ కాదనే టాక్ తాజాగా వినిపిస్తోంది. పవన్ కోసం పూరి కొత్త లైన్ అనుకున్నాడనీ, ఆ లైన్ పైనే స్క్రిప్ట్ వర్క్ జరగనుందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ వరుసగా భారీ ప్రాజెక్టులను ఒప్పుకుని ఉన్నారు. అందువలన పూరి ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది చెప్పడం కష్టం. ఎంత ఆలస్యమైనా ఈ కాంబినేషన్లో ప్రాజెక్టు అయితే ఉందనేది వాస్తవం అనే చెప్పుకుంటున్నారు. మరి పవన్ కోసం పూరి రెడీ చేసిన ఆ లైన్ ఏమిటో .. ఆయన పవన్ ను ఈ సారి ఎలా చూపించనున్నాడో అనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News