రఘురామకృష్ణరాజుపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం గురించి తెలుసుకుని షాక్ అయ్యాను: సుమ‌ల‌త‌

05-06-2021 Sat 10:20
  • ఎంపీపై పోలీసులు ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం దిగ్ర్భాంతికరం
  • ఈ విష‌యాన్ని నమ్మలేకపోతున్నా
  • రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటా
sumalata slams police

లోక్‌సభ స‌భ్యుడు రఘురామకృష్ణరాజుపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం ఏంటంటూ మాండ్య ఎంపీ, సినీన‌టి సుమలత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై ఆమె తాజాగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఎంపీపై కస్టడీలో పోలీసులు ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం దిగ్ర్భాంతికరమని ఆమె పేర్కొన్నారు.

ఈ విష‌యాన్ని తాను నమ్మలేకపోతున్నానని, దీని గురించి తెలుసుకుని విస్మ‌యానికి గుర‌య్యాన‌ని చెప్పారు. దీనిపై  వెంట‌నే చర్యలు తీసుకోక‌పోతే ఈ తీరు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై చెడు ప్రభావం చూపిస్తుందని అన్నారు. త‌న‌ సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని ఆమె చెప్పారు. ఆయ‌న‌పై జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు.