Telangana: తెలంగాణ కరోనా వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లకు స్పందన కరవు

No response for Telangana govt global tenders
  • వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు
  • పలు రాష్ట్రాల బాటలో తెలంగాణ
  • నిన్నటితో ముగిసిన గ్లోబల్ టెండర్ల గడువు
  • ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపని వైనం
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు గ్లోబల్ టెండర్ల దిశగా పలు రాష్ట్రాలు అడుగులు వేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు గ్లోబల్ టెండర్లను పిలిచింది. అయితే, తీవ్ర నిరాశ కలిగిస్తూ ఒక్క సంస్థ కూడా స్పందించలేదు. గ్లోబల్ టెండర్లకు నిన్నటితో గడువు ముగియగా, తెలంగాణ సర్కారు ప్రతిపాదనపై ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఆస్ట్రాజెనెకాతో పాటు స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీదారు నుంచి స్పందన వస్తుందని భావించినా, ఆ దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించలేదు.

దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులైన సీరం, భారత్ బయోటెక్ నుంచి పరిమిత సంఖ్యలో డోసులు అందుతున్న నేపథ్యంలో గ్లోబల్ టెండర్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ తాజా పరిణామంతో, కోటి వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయాలని భావించిన తెలంగాణ సర్కారు ఆశలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.
Telangana
Global Tenders
Response
Corona Vaccines

More Telugu News