మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్ కన్నుమూత

05-06-2021 Sat 07:03
  • అనారోగ్యంతో మరణించిన అనిరుధ్
  • ఆయన వయసు 91 సంవత్సరాలు
  • అనిరుధ్ తనయుడు ప్రవింద్ ప్రస్తుతం మారిషస్ ప్రధాని
  • ప్రవింద్ ను ఫోన్ ద్వారా పరామర్శించిన ప్రధాని మోదీ
Mauritius former president Anerood Jugnauth died

మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ కు పితృవియోగం కలిగింది. ప్రవింద్ తండ్రి, మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. అనిరుధ్ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

పితృవియోగంతో బాధపడుతున్న మారిషస్ ప్రధాని ప్రవింద్ కు ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గొప్ప రాజనీతిజ్ఞుల్లో అనిరుధ్ జగన్నాథ్ ఒకరని మోదీ కొనియాడారు. అనిరుధ్ జగన్నాథ్ ను భారత ప్రభుత్వం గతేడాది పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఆయన రాజకీయ జీవితం 1963లో ప్రారంభమైంది.