నూతన పార్టీకి అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల

05-06-2021 Sat 06:12
  • పార్టీ పేరును రిజిస్టర్ చేయించిన షర్మిల
  • వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఈసీ వద్ద నమోదు
  • జులైలో పార్టీ ప్రకటన!
  • తెలంగాణలో జోరుగా షర్మిల కార్యకలాపాలు
YS Sharmila appoints party official spokes persons

వైఎస్ షర్మిల తెలంగాణలో స్థాపించబోయే పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అనే పేరు ఖరారైంది. ఇటీవల షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ పార్టీ పేరును రిజిస్టర్ చేయించారు. ఈ క్రమంలో షర్మిల తన పార్టీకి అధికార ప్రతినిధులను నియమించారు.

ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డిలను అధికార ప్రతినిధులుగా పేర్కొంటూ షర్మిల కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కాగా, షర్మిల పార్టీని జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.